యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ 2025లో రిలీజ్ కానున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటి, ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలకు బ్లాక్ బస్టర్ స్పందన లభించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన బుజ్జి తల్లి, శివ శక్తి, హిలెస్సో హిలెస్సో పాటలు మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈరోజు, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 28న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు.
ట్రైలర్ పోస్టర్‌లో, అల్యూమినియం బకెట్ ని వెపన్ గా పట్టుకొని నాగ చైతన్య, విలన్స్ చంపడానికి సిద్ధంగా ఉన్న ఫెరోషిషియస్ అవతారంలో కనిపించారు. బకెట్‌పై రక్తపు గుర్తులను కూడా మనం గమనించవచ్చు, ఇది సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్ నుంచి ప్రజెంట్ చేస్తోంది. లవ్ ఎలిమెంట్స్ తో పాటు, సినిమాలో మంచి యాక్షన్ కూడా ఉంటుందని కూడా ఇది సూచిస్తుంది.