Advertisementt

చైతు-సాయి పల్లవిల రొమాంటిక్ సాంగ్

Thu 23rd Jan 2025 08:35 PM
thandel  చైతు-సాయి పల్లవిల రొమాంటిక్ సాంగ్
Hilesso Hilesso From Thandel చైతు-సాయి పల్లవిల రొమాంటిక్ సాంగ్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య నుంచి ఫిబ్రవరి 7 న రాబోతున్న తండేల్ చిత్రం పై అంచనాలెలా ఉన్నాయో అనేది సాంగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే తెలుస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మొదటి రెండు పాటలు బుజ్జి తల్లి, నమో నమః శివాయ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సాను విడుదల చేశారు.

హైలెస్సో హైలెస్సా సాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ షిప్ ని, ఎదురుచూపులని, నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న అనురాగాన్ని  అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది

వండర్ ఫుల్ మోలోడీస్ ని కంపోజ్ చేయడంలో మాస్టర్ అయిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్, హృదయాన్ని తాకే మరొక లవ్ మెలోడీని కంపోజ్ చేశారు. శ్రేయ ఘోషల్, నకాష్ అజీజ్ వోకల్స్ మెలోడీని మరింత ఎలివేట్ చేశాయి. శ్రీమణి లిరిక్స్ విడదీయరాని ప్రేమని చాలా గొప్ప ప్రెజంట్ చేశాయి.

సాయి పల్లవి, నాగ చైతన్య కెమిస్ట్రీ  బ్యూటీఫుల్ గా వుంది. నాగ చైతన్య రగ్గడ్ లుక్ లో అదరగొట్టారు, సాయి పల్లవి ఎలిగెంట్ గా తన  క్లాసిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో కట్టిపడేసింది. ఈ ఇద్దరి జోడి అద్భుతంగా వుంది. అద్భుతమైన విజువల్స్,  వోకల్స్, కంపోజిషన్ తో ఈ పాట బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ గా నిలిచింది.

Hilesso Hilesso From Thandel:

Hilesso Hilesso From Thandel unvealed 

Tags:   THANDEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ