Advertisementt

కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్

Mon 20th Jan 2025 02:30 PM
kannappa  కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్
Akshay Kumar As The Eternal Protector Lord Shiva From Kannappa కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్నప్ప సినిమా భారీ ఎత్తున రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లో మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ వస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లు, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సోమవారం శివుడిగా నటించిన అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.  

శివుడిగా అక్షయ్ కుమార్ పాత్ర ఎలా ఉండబోతోందో ఈ పోస్టర్‌తో చూపించారు. శివ తాండవం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. ఇలాంటి ఓ అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, శివుని ఆశీస్సులతో ఆడియెన్స్ ముందుకు ఏప్రిల్ 25న రాబోతోన్నామంటూ అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

కన్నప్ప చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇలా ఎంతో మంది భారీ తారాగణం నటించింది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

Akshay Kumar As The Eternal Protector Lord Shiva From Kannappa:

Unveiling Bollywood Star Akshay Kumar As The Eternal Protector Lord Shiva From Vishnu Manchu Kannappa   

Tags:   KANNAPPA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ