Advertisementt

శివుని ఆజ్ఞతోనే కన్నప్ప-విష్ణు మంచు

Sat 18th Jan 2025 04:14 PM
kannappa  శివుని ఆజ్ఞతోనే కన్నప్ప-విష్ణు మంచు
Kannappa is Shaping Up Beautifully with Lord Shiva Blessings-Vishnu Manchu శివుని ఆజ్ఞతోనే కన్నప్ప-విష్ణు మంచు
Advertisement
Ads by CJ

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్నప్ప చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ను శుక్రవారం నాడు బెంగళూరులో ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..

హీరో విష్ణు మంచు మాట్లాడుతూ.. కన్నప్ప ప్రమోషన్స్‌ను కన్నడ నేల నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు మొదటి సారిగా కన్నప్ప చిత్రాన్ని చేశారు. ఆ తరువాత శివ రాజ్ కుమార్ గారు కూడా చేశారు. తెలుగులో స్వర్గీయ శ్రీ కృష్ణంరాజు గారు బాపు రమణ దర్శకత్వంలో కన్నప్ప చేశారు. మళ్లీ ఇప్పుడు మేం కన్నప్ప కథను చెప్పబోతోన్నాం. ఈ తరానికి కన్నప్ప ఎవరు? ఆయన కథ ఏంటి? ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటి? అని క్లియర్‌గా చూపించాలనే ఈ కన్నప్ప సినిమాను చేస్తున్నాం. 

ముఖేష్ కుమార్ సింగ్ బుల్లితెరపై ఓ లెజెండ్. మహాభారతం సీరియల్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. ఇండియా నుంచి టీంను న్యూజిలాండ్‌కు తీసుకెళ్లాం. ఇతర దేశాల నుంచి కూడా టెక్నీషియన్లను తీసుకొచ్చాం. శరత్ కుమార్ గారు సెట్‌కి ఆన్ టైంకి వచ్చేవారు. ప్రభు దేవా అన్న అడిగిన వెంటనే మా ప్రాజెక్ట్ కోసం వచ్చారు. అసలు ఈ కథను అనుకున్నప్పుడు రాక్ లైన్ వెంకటేష్ గారికే ఫోన్ చేసి చెప్పాను. అద్భుతంగా ఉంటుంది చేయ్ అని ధైర్యాన్ని ఇచ్చారు. శివుని ఆజ్ఞతోనే ఈ చిత్రం ప్రారంభమైందని అనిపిస్తుంది. నాకు ఈ కన్నప్ప ఎంతో ప్రత్యేకం. ఆర్ఆర్ అవ్వక ముందే రాక్ లైన్ వెంకటేష్ గారు ఈ మూవీని చూశారు. అద్భుతంగా వచ్చిందని భరోసానిచ్చారు. ఇక ఆ శివుని ఆశీస్సులతో మేం ఏప్రిల్ 25న రాబోతోన్నామని అన్నారు.

ప్రభుదేవా మాట్లాడుతూ.. ముఖేష్ కుమార్ సింగ్ మహాభారతం సీరియల్ తీశారు. శివ భక్తుడిలా మారిపోయారు. ఆయన ప్రతీ గుడికి వెళ్తుంటారు. కన్నప్ప చిత్రాన్ని అద్భుతంగా తీశారు. మోహన్ బాబు గారు, విష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. మోహన్ లాల్ సర్, అక్షయ్ కుమార్ సర్, నా స్నేహితుడు ప్రభాస్, శరత్ కుమార్ సర్ వంటి గొప్ప ఆర్టిస్టులు ఈ చిత్రం కోసం పని చేశారు. హీరోయిన్ ప్రతీ ముకుందన్ అద్భుతంగా నటించారు. అమెరికన్ కెమెరామెన్ అద్భుతమైన విజువల్స్ అందించారు. నేను ఈ చిత్రం కోసం మూడు సాంగ్స్ కొరియోగ్రఫీ చేశాను. స్టీఫెన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

శరత్ కుమార్ మాట్లాడుతూ.. కన్నప్ప అంటే శివ భక్తుడు అని అందరికీ తెలిసిందే. కానీ కన్నప్ప గురించి తెలియని ఎన్నో విశేషాల్ని ఇందులో చూపించబోతున్నారు. న్యూజిలాండ్‌లో ఎంతో అద్భుతంగా, సరదాగా షూటింగ్ చేశాం. మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ ఇలా ఎంతో మంది అద్భుతమైన ఆర్టిస్టులు పని చేశారు. చాలా భారీ తారాగణంతో ఈ చిత్రం రాబోతోంది. నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ను ఈ చిత్రంలో చూపిస్తాం.. ఎవరు నాస్తికులు.. ఎవరు ఆస్తికులు అనేది మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది అని అన్నారు.

దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కన్నడలో రాజ్ కుమార్ గారు మొదటగా కన్నప్ప చిత్రాన్ని చేశారు. ఆ సినిమా చూసిన తరువాత కన్నప్ప సినిమాను మళ్లీ చేయడం, ఆ పాత్రను మళ్లీ రీక్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ నాకు అద్భుతమైన నటీనటులు దొరికారు. సినిమాకు గొప్ప ఆర్టిస్టులంతా కలిసి వచ్చారు. వారంతా అద్భుతంగా నటించారు. విష్ణు, మోహన్ బాబు గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమా విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుంది అని అన్నారు.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ రాక్ లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ.. కన్నప్ప చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. మోహన్ బాబు గారు, విష్ణు కలిసి ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు నటించారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్ ఇలా అద్భుతమైన క్యాస్టింగ్ ఉంది. ప్రస్తుతం సినిమాను తీయడం కంటే మార్కెటింగ్ చేసుకోవడం చాలా కష్టం. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Kannappa is Shaping Up Beautifully with Lord Shiva Blessings-Vishnu Manchu:

Kannappa is Shaping Up Beautifully with Lord Shiva Blessings-Vishnu Manchu at Bangalore Press Meet 

Tags:   KANNAPPA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ