బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం డాకు మహారాజ్ ఈ సంక్రాంతి విడుదలైన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఎందుకు పెద్ద విజయం అంటున్నాం అంటే బాలయ్య కెరీర్లో ఇప్పటి వరకు 3 రోజుల్లో 92 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. గతంలో ఎన్నడూ ఇంత భారీ స్థాయిలో వసూళ్లు బాలకృష్ణ ఖాతాలో పడలేదు. అందుకే బాలయ్య కెరీర్ లో డాకు మహారాజ్ అతి పెద్ద విజయంగా నమోదు అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత నాగవంశీ ముందే ఈ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే మైలు రాయి అని నాగవంశీ చాలా గడ్స్ తో చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది. కానీ బాలయ్యకి మాత్రం ఇవన్నీ లెక్కలోకి రావు. సినిమా చేశామా సినిమా విడుదలయిందా నెక్స్ట్ ఏంటి? అంటూ దూసుకెళ్లడం బాలయ్య స్టయిల్. త్వరలోనే 100 క్రోర్ క్లబ్లోకి వస్తున్నాడు ఈ పొంగల్ హీరో బాలయ్య.
కొసమెరుపు ఏమిటంటే డైరెక్టర్ బాబి భార్యా కూడా నెక్స్ట్ ఏమిటి అంటూ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన బాబీని ఆట పట్టిస్తుండటం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..