Advertisementt

రాజా సాబ్ ప్రభాస్ పొంగల్ పోస్టర్

Tue 14th Jan 2025 03:31 PM
prabhas  రాజా సాబ్ ప్రభాస్ పొంగల్ పోస్టర్
Prabhas New Poster from The Raja Saab రాజా సాబ్ ప్రభాస్ పొంగల్ పోస్టర్
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ రాజా సాబ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో రాజా సాబ్ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాజా సాబ్ సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.

సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజా సాబ్ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. రాజా సాబ్ సినిమాను అందరికీ గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం రాజా సాబ్ చిత్రీకరణ తుది దశలో ఉంది.

Prabhas New Poster from The Raja Saab:

 Prabhas New Poster from The Raja Saab Released with Makar Sankranti Wishes

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ