Advertisementt

కిరణ్ అబ్బవరం దిల్ రూబా రిలీజ్ డేట్ లాక్

Tue 14th Jan 2025 10:15 AM
kiran abbavaram  కిరణ్ అబ్బవరం దిల్ రూబా రిలీజ్ డేట్ లాక్
Kiran Abbavaram Dilruba Makar Sankranthi Poster Out Now కిరణ్ అబ్బవరం దిల్ రూబా రిలీజ్ డేట్ లాక్
Advertisement
Ads by CJ

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా దిల్ రూబా. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రూబా చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రూబా సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా దిల్ రూబా సినిమా నుంచి విశెస్ చెబుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో కిరణ్ అబ్బవరం జాయ్ ఫుల్ గా కనిపిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దిల్ రూబా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరి 14న వాలైంటెన్స్ డే దిల్ రూబా రిలీజ్ తో మరింత స్పెషల్ కానుంది.

Kiran Abbavaram Dilruba Makar Sankranthi Poster Out Now:

Kiran Abbavaram Dilruba release date locked 

Tags:   KIRAN ABBAVARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ