ఈ సంక్రాంతి కి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో పాన్ ఇండియాకి గురి పెట్టగా.. బాలకృష్ణ డాకు మహారాజ్ అంటూ యాక్షన్ ప్రియులకు స్పాట్ పెట్టారు, ఇక విక్టరీ వెంకటేష్ అయితే సరదాగా కామెడీతో ఆడియన్స్ ముందుకు సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు. మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జోనర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
మరి ఈ మూడు చిత్రాల ట్రైలర్స్ విడుదలయ్యాయి, మూడు చిత్రాల ట్రైలర్ వచ్చాక కామన్ ఆడియన్స్ లో గేమ్ చెంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలపై ఎలాంటి ఒపీనియన్ ఉందొ అనేది ఒక్కసారి చూసేద్దాం.
ముందుగా జనవరి 10 శుక్రవారం విడుదలకాబోతున్న గేమ్ చేంజర్ విషయంలో మెగా అభిమానులు కాన్ఫిడెంట్ గానే కనబడుతున్నారు. కామన్ ఆడియన్స్ మాత్రం ట్రైలర్ కట్ అర్ధం కాలేదు, ఇండియన్ 2 చూసాక గేమ్ చెంజర్ పై నమ్మకం కుదరడం లేదు, శంకర్ ఎలాగైనా రక్తి కట్టిస్తారు, కానీ గేమ్ చేంజర్ లోని కొన్ని ఫ్రేమ్స్ లో శంకర్ అవుట్ డేటెడ్ అనిపిస్తుంది అని మాట్లాడుకుంటున్నారు.
జనవరి 12 న రెండో సినిమాగా ఈ సంక్రాంతి రేస్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ టైటిల్ విషయంలో చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. డాకు ఫస్ట్ గ్లిమ్ప్స్ లో బాలయ్య యాక్షన్ అవతార్ చూసి అద్భుతం అన్నవారే.. ఆయన గుర్రపు స్వారీ చేస్తే జస్ట్ ఓకె అంటూ తేల్చేసారు. ట్రైలర్ కట్ ఏం చేసినా కామన్ ఆడియెన్స్ లో జోష్ రావడం లేదు.
ఈ సంక్రాంతికి ముచ్చటగా మూడో సినిమాగా జనవరి 14 పండుగ రోజు రాబోతున్న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఈ పండుగ విన్నర్ అంటూ కామన్ ఆడియన్స్ తేల్చేయడం విశేషం, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉండడం, సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవడం, ప్రమోషన్స్ పరంగా ఈ చిత్రమే ప్రేక్షకులకు దగ్గరవడం అన్ని ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి.
మరో ఐదు రాజుల్లో అసలు సిసలు పొంగల్ విన్నర్ ఎవరు అనేది ఆడియన్స్ డిసైడ్ చేసేలోపే.. కొంతమంది ఈ రకంగా తమ ఒపీనియన్ ని షేర్ చేస్తున్నారు.