సంగీతదర్శకుడు, నిర్మాత, నటుడు రఘుకుంచే టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం గేదెలరాజు. కాకినాడ తాలుకా అనేది సినిమా సబ్‌టైటిల్. నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వంలో లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. కాకినాడ దగ్గరలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రఘుకుంచే సమర్పిస్తుండగా వాణి రవికుమార్ మోటూరి నిర్మాత. రవి చిన్నబిల్లి, వీరభద్రరావు తడాల సహ నిర్మాతలు. రామచంద్రమ్ పుణ్యమంతుల, టీనా శ్రావ్య, శ్రీదివ్య, వికాస్, మౌనిక, రవి చిన్నబిల్లి ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం టైటిల్‌లాంచ్ ఎనౌన్స్‌మెంట్‌ను హైదరాబాద్‌లో చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్, మెహబూబ్ భాషా, కిట్టయ్య తదితరులు నటిస్తున్నారు. అనేక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తయారవుతున్న ఈ సినిమాకి సంగీతం– రఘుకుంచే, డిఓపి– సాయికుమార్ దారా ఎడిటర్– సుధీర్ ఎడ్ల కోడైరెక్టర్– శేఖర్ కుంపట్ల పిఆర్‌వో–మూర్తి మల్లాల. కథ, కథనం, మాటలు, దర్శకత్వం– చైతన్య మోటూరి.