Advertisementt

బాలయ్య దబిడి దిబిడి

Thu 02nd Jan 2025 06:24 PM
daaku maharaaj  బాలయ్య దబిడి దిబిడి
Daaku Maharaaj Third Song Dabidi Dibidi బాలయ్య దబిడి దిబిడి
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన సినిమా విడుదలవుతుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ఈ సంక్రాంతికి ఆయన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా, రెండింటికీ మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడవ గీతం విడుదలైంది.

డాకు మహారాజ్ చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మూడవ గీతం దబిడి దిబిడిని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఒక ఊపు ఊపుతోంది. నందమూరి బాలకృష్ణ అంటే డైలాగ్ లకు పెట్టింది పేరు. అలాంటి బాలకృష్ణ చిత్రాలలోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్ లతో రూపుదిద్దుకున్న దబిడి దిబిడి గీతం అభిమానులకు నిజమైన విందును అందిస్తోంది. ఈ మాస్ నృత్య గీతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌతేలా కాలు కదిపారు. తమ అసాధారణ ఎనర్జీతో, అదిరిపోయే స్టెప్పులతో మాస్ ప్రేక్షకులు మెచ్చేలా పాటను మలిచారు.

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఏ స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కలయికలో వచ్చే ప్రతి పాట ప్రేక్షకులని రంజింపచేస్తుంది. ఇప్పుడు దబిడి దిబిడి కోసం తమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వాగ్దేవి తన శక్తివంతమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఇక ప్రతిభావంతులైన గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సంగీతానికి తగ్గట్టుగా డైలాగ్ లతో అద్భుతమైన సాహిత్యం అందించారు. సంగీతం, సాహిత్యం చక్కగా కుదిరి.. ఇది గొప్ప నృత్య గీతంగా మారింది. జై బాలయ్య తరహాలో అభిమానుల హృదయాల్లో ఈ పాట నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్, శేఖర్ వీజే అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటను నిజమైన మాస్ ట్రీట్ లా మార్చాయి. అభిమానులతో పాటు, అన్ని వయసుల వారు కాలు కదిపేలా ఉన్న ఈ గీతం, ఖచ్చితంగా చాలా కాలం వినిపించే పాటగా నిలుస్తుంది.

Daaku Maharaaj Third Song Dabidi Dibidi :

Daaku Maharaaj Third Song Dabidi Dibidi ft Nandamuri Balakrishna and Urvashi Rautela is out

Tags:   DAAKU MAHARAAJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ