Advertisementt

పవన్ ఇచ్చే డేట్ బట్టి గేమ్ చేంజర్ ఈవెంట్

Sun 29th Dec 2024 06:54 PM
game changer  పవన్ ఇచ్చే డేట్ బట్టి గేమ్ చేంజర్ ఈవెంట్
A Game Changer event depending on the date given by Pawan పవన్ ఇచ్చే డేట్ బట్టి గేమ్ చేంజర్ ఈవెంట్
Advertisement
Ads by CJ

రామ్ చ‌ర‌ణ్ హీరో గా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ ఆదివారం నాడు ఆర్‌సీ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తైన ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్‌కు దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

ఏ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు గేమ్ చేంజర్ ట్రైలర్ నా ఫోన్‌లో ఉంది. కానీ అది మీ (ఆడియెన్స్) వద్దకు రావాలంటే ఇంకా మేం చాలా పని చేయాల్సి ఉంది. ఇప్పుడు ట్రైలర్‌లే సినిమా స్థాయిని నిర్ణయిస్తున్నాయి. అందుకే ఈ ట్రైలర్‌ను కొత్త ఏడాది సందర్భంగా అంటే జనవరి 1న మీ ముందుకు తీసుకు వస్తున్నాం. సినిమా అంటేనే విజయవాడ. ఇక్కడ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను రివీల్ చేయడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారి మీద 40, 50 ఏళ్ల నుంచి  మీ అభిమానం అలానే ఉంటోంది. 

చిరంజీవి నుంచి మనకు పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, బన్నీ, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మందిని అందించారు. ఇలా అందరికీ మెగా ఫ్యాన్ సపోర్ట్ ఉంటూనే వస్తోంది. అమెరికాలో చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈవెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇక్కడకు వచ్చాను. ఆయన ఇచ్చే డేట్‌ను బట్టి ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? అనేది ఫిక్స్ అవుతాం. ఈ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు. చరిత్ర క్రియేట్ చేసేలా ఉండాలి. ఇటు వచ్చే ముందే చిరంజీవి గారికి ఫోన్ చేశాను. అప్పుడు సినిమా చూశారు కదా.. ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయింది.. మరోసారి సినిమా చూడండి అని అడిగాను. వాళ్లు అక్కడ సినిమా చూడటం స్టార్ట్ చేశారు. నేను ఇక్కడకు బయల్దేరాను. ఇక్కడకు వచ్చిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఈ సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదు అని ఫ్యాన్స్‌కు చెప్పండి అని చిరంజీవి గారు అన్నారు.  

మెగా పవర్ స్టార్‌లో మెగాని, పవర్‌ని చూస్తారు. నాలుగేళ్ల క్రితం శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఏం ఫీల్ అయ్యానో.. చిరంజీవి గారు ఒక్కో సీన్ గురించి చెబుతూ ఉంటే అదే ఫీల్ అయ్యాను. చాలా సంతోషంగా అనిపించింది. జనవరి 10న మీరు రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడబోతోన్నారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా, కొద్ది సేపు పోలీస్ ఆఫీసర్‌గా, ఇంకొద్ది సేపు రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. శంకర్ మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ఐదు పాటలు బిగ్ స్క్రీన్ మీద దేనికదే అన్నట్టుగా ఉంటుంది. 2 గంటల 45 నిమిషాలు మాత్రమే ఉండాలని నిడివి విషయంలోనూ శంకర్ గారితో మాట్లాడాను. అంతే నిడివిలో శంకర్ గారు అద్భుతంగా కట్ చేసి ఇచ్చారు. సినిమా పరిగెడుతూనే ఉంటుంది. సినిమాలో అన్ని అంశాలు ఉంటూనే అన్ ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. ఎస్ జే సూర్య, రామ్ చరణ్ సీన్లతో థియేటర్లు దద్దరిల్లుతాయి. జనవరి 1న ట్రైలర్ రానుంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డేట్‌ను బట్టి జనవరి 4 లేదా 5 ఏపీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జనవరి 10న సినిమా రాబోతోంది. ఈ సంక్రాంతిని గట్టిగా సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి అని అన్నారు

A Game Changer event depending on the date given by Pawan:

Game Changer trailer launch locked 

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ