బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలెబ్రటీస్ చాలామంది న్యూ ఇయర్ సెలెబ్రెషన్స్ కోసం వెకేషన్స్ బాట పట్టారు. 2024 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ.. 2025 ఏడాదికి స్వాగతం పలికేందుకు రకరకాల ప్రదేశాలను సెలెక్ట్ చేసుకుని స్టార్స్ చాలామంది వెకేషన్స్ అంటూ ఫ్లైట్ ఎక్కుతున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీస్ లో రణబీర్ కపూర్, అలియా భట్ తమ క్యూట్ కుమార్తెను తీసుకుని న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఫ్లైట్ ఎక్కేందుకు వచ్చి ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేసారు. ఇలా చాలామంది ముంబై తారలు వెకేషన్స్ కోసం బయలుదేరుతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, మహేష్, చరణ్ ఇలా స్టార్ హీరోలు ఫ్యామిలీస్ తో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం వెళ్ళేవాళ్లలో ఉన్నారు.
హీరోయిన్స్ తమ తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ వేడుకల కోసం కదలడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల కోసం బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి గోవాకి వెళ్ళిపోయింది. కియారా ఆమె భర్త సిద్దార్థ్ తో, రకుల్ తన భర్త జాకీ భగ్నానీతో ఇప్పటికే వెకేషన్స్ కి వెళ్ళిన వారిలో ఉన్నారు.
రష్మిక, విజయ్ దేవరకొండ కూడా న్యూ ఇయర్ వేడుకల కోసం కలిసి వెళ్లారు. మరి ఈ 2025 ఏడాదికి స్వాగతం పలికేందుకు చాలామంది తారలు వెకేషన్ మూడ్ లోకి వెళ్లిపోయారు.