దేవర బ్యూటీ జాన్వీ కపూర్ రీసెంట్ గా క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ తో తెగ హడావిడీ చేసింది. జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా తో కలిసి మరీ క్రిస్టమస్ ని సెలెబ్రేట్ చేసుకున్న జానీ కపూర్.. ఆ ఫోటొస్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. గత కొన్నాళ్లుగా శిఖర్ పహారియా జాన్వీ కపూర్ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతూ ఉంది.
ఎందుకంటే వెకేషన్స్ మాత్రమే కాదు, దైవ దర్శనాలకు కలిసి వెళుతూ జాన్వీ కపూర్-శిఖర్ పహారియాలు సరదాగా కనిపిస్తున్నారు. అందుకే అందరూ వారిద్దరి పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక పర్సనల్ గా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసే పిక్స్ చూస్తే ఎప్పుడూ యూత్ పండగ చేసుకుంటారు.
తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన గ్లామర్ పిక్ చూస్తే వావ్ జాన్వీ పాపా అనాల్సిందే. లూజ్ హెయిర్ లో దేవకన్యలా జాన్వీ కపూర్ ఇచ్చిన ఫోజ్ కి మతిపోవాల్సిందే.