నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న అఖండ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. అఖండ తాండవం షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. బాబీ తో చేస్తున్న డాకు మహారాజ్ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఇమ్మిడియట్ గా బాలయ్య అఖండ 2 సెట్స్ లోకి వెళ్లిపోయారు.
ఇప్పుడు అఖండ 2 షూటింగ్ నుంచి బాలయ్య బ్రేక్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. కారణం ఆయన న్యూ ఇయర్ పూర్తి కాగానే డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంది. జనవరి 12 న విడుదల కాబోతున్న డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో ఇప్పటికే దర్శకుడు బాబీ, నాగవంశీ పాల్గొంటున్నారు.
జనవరి 1 తర్వాత బాలయ్య కూడా డాకు ప్రమోషన్స్ కి రాబోతున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సంక్రాంతి ఇంటర్వూస్ తో వచ్చే వారం మొత్తం బాలయ్య బిజీ కాబోతుండడంతో ఆయన అఖండ 2 కి చిన్నపాటి బ్రేక్ తీసుకుని మళ్లీ సంక్రాంతి పూర్తి కాగానే వెళ్ళిపోతారని తెలుస్తోంది.
జనవరి మూడో వారం నుంచి ఆఖండ పాత్రకు సంబంధించిన ఎంట్రీ సన్నివేశాలను బోయపాటి తెరకెక్కిస్తారట. ఇందులో భాగంగానే రామోజీ ఫిలింసిటీలో బాలయ్య ఇంట్రో కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది.