జనవరి 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఫ్యామిలీ డ్రామా సినిమా నారి
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా నారి. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. నారి సినిమా 2025, జనవరి 24వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ - అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి ఫ్యామిలీ డ్రామా కథతో నారి సినిమాను రూపొందించాము. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24న గ్రాండ్ గా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మా సినిమాలో ప్రముఖ సంగీత దర్శకులు రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్ మా నారి సినిమాకు తమ వాయిస్ అందించారు. మహిళా సాధికారత మీద రూపకల్పన చేసిన పాటను ప్రముఖ సింగర్ చిన్మయి అద్భుతంగా పాడారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సీషోర్ అనే యువకుడు ఒక మంచి పాట పాడారు. మా నారి సినిమా ఆడియో దివో కంపెనీ ద్వారా త్వరలోనే రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మహిళల్ని గౌరవించాలనే గొప్ప కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే అంశాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడినీ ఆకట్టుకుంటాయి. నారి సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్ - మాధవ్ కుమార్ గుల్లపల్లి, పీఆర్ఓ - మూర్తి మల్లాల, నిర్మాత - శ్రీమతి శశి వంటిపల్లి, దర్శకత్వం - సూర్య వంటిపల్లి.