బిగ్ బాస్ సీజన్ 8 లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సోనియా ఆకుల.. బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్-పృథ్వీ లతో ఫ్రెండ్ షిప్ చేస్తే.. అది ఆమె కి హెల్ప్ అవ్వకపోగా ఎలిమినేట్ అయ్యేలా చేసింది. అటు సోనియా పై యష్మి, విష్ణు ప్రియాలు గొడవ పెట్టుకుని ఆఖరికి సోనియా ఆకుల మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యేలా చేసారు. ముఖ్యంగా నిఖిల్-పృథ్వీ ల ఫ్రెండ్ షిప్ ఆమెకు డ్యామేజ్ అయ్యింది. ఆడియన్స్ సోనియాని ఎలిమినేట్ చేసేవరకు నిద్రపోలేదు. ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చాక సోనియా ఆకుల బిగ్ బాస్ పై సన్సెషనల్ కామెంట్స్ చేసింది. వాళ్ళు కంటెంట్ కోసం నన్ను, నా ఇమేజ్ ని రోడ్డున పడేశారంటూ బిగ్ బాస్ నే బ్లేమ్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 8 ముగియకముందే సోనియా ఆకుల యష్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన ఎంగేజ్మెంట్ సైలెంట్ గా చేసుకున్నా పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేసుకోబోతుంది.
సోనియా ఆకుల పెళ్లి ఈ నెల 21 న మధ్యాన్నం 3.30 నిమిషాలకు జరగబోతుంది. అంటే బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో ముగియబోతున్న తరుణంలో సోనియా ఆకుల డిసెంబర్ 21 న వివాహం చేసుకోవడం విశేషం. తన పెళ్ళికి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఆహ్వానంచిన వీడియో ని సోనియా ఆకుల షేర్ చేసింది.