ప్రముఖ నవలా కారులు సీనియర్ సినీపాత్రికేయులు భగీరథ శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథను నాగలాదేవి నవలగా రాసి విజయం సాధించారని తెలంగాణ రాష్ట్రం జి.యస్.టి.కమీషనర్ , ప్రముఖకవి డా.జెల్ది విద్యాధర్ పేర్కొన్నారు.శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ధర్మవరంలో ఏర్పాటు చేసిన"ధర్మవరం కవితోత్సవం-నాగలాదేవి నవల పరిచయసభ"లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సందేశమిచ్చారు.నాగలా దేవి ఒక వేశ్యకూతురని తెలినినా కృష్ణదేవరాయలు ప్రేమించి పెళ్లి చేసుకున్న గొప్ప చారిత్రకాంశాన్ని భగీరథ అద్భుత నవలగా శిల్పీకరించడం తెలుగు సాహిత్యానికే మకుటాయమానమన్నారు.
ఇంతవరకు ఇలాంటి క్లాసిక్ నవలను చూడలేదన్నారు.ఎన్నో ఏళ్ళు తీవ్రంగా శ్రమించి భగీరథ నాగలాదేవి నవలను రాశారని ఆంధ్రప్రభ ఎడిటర్ వై.యస్ ఆర్ శర్మ పేర్కొన్నారు.ఇప్పటి వరకు ఎవరికీ తెలియని సాహిత్య అంశాలెన్నో ఈ నవలలో రచయిత దృశ్యమానం చేయడం అభినందనీయమని డా.బిక్కి కృష్ణ తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొపెసర్ దేవన్న,డా.యశోదా దేవి,,జాబిలి చాంద్ బాషా ,తరిమెల అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రచయిత భగీరథను,నూరు మంది కవులను నిర్వాహకులు ఘనంగా సన్మానంచారు.
నాగలాదేవి నవలను ఎందుకురాయాల్సి వచ్చిందో,చారిత్రక పరిశోధనను గురించి రచయిత భాగీరథ కూలంకషంగా వివరించారు.నాగలాదేవి అనంతపురం రైతులను చూసి చలించి సహాయం చేసిన విషయాన్ని అనంతరాముడు గుర్తుచేశారు .ఈ కవితోత్సవంలో వందమంది కవులు తమ కవితలు వినిపించారు.