Advertisementt

కన్నప్పలో అరియానా, వివియానా స్పెషల్

Mon 02nd Dec 2024 01:57 PM
kannappa   కన్నప్పలో అరియానా, వివియానా స్పెషల్
Introducing Ariaana and Viviana From Kannappa కన్నప్పలో అరియానా, వివియానా స్పెషల్
Advertisement
Ads by CJ

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అత్యంత భారీ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్ప ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు.

కన్నప్ప ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతీ సోమవారం ఓ అప్డేట్ ఇస్తామని మేకర్లు ఇది వరకు ప్రకటించారు. ఇందులో భాగంగా విష్ణు మంచు పిల్లలు అరియానా మంచు, వివియానా మంచు ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు. అంతే కాకుండా ఈ రోజు విష్ణు మంచు కవల కుమార్తెల పుట్టినరోజులు కావడం కూడా విశేషం.

ఈ పోస్టర్‌లో పిల్లలిద్దరూ గిరిజన వేషధారణలో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. శ్రీ కాళహస్తి పురాణ కథ ప్రాముఖ్యతను చాటి చెప్పే పాటలో కనిపించనున్నారు. పాట పాడినా, నృత్యం చేసినా, ఇది శివుని కోసం అని ఈ పోస్టర్‌లో చూపించారు.

ఈ మేరకు విష్ణు మంచు పోస్ట్ చేస్తూ.. పుట్టినరోజు సందర్భంగా నా కుమార్తెల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ క్షణంలో నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. నా చిన్ని తల్లులు తెరపై సృష్టించే మ్యాజిక్‌ను చూసేందుకు నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని అన్నారు. ఇది వరకు కన్నప్ప నుంచి అవ్రామ్ లుక్‌ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Introducing Ariaana and Viviana From Kannappa :

Introducing Ariaana and Viviana From Vishnu Manchu Kannappa 

Tags:   KANNAPPA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ