Advertisementt

తెలుగులో పా-పా గా రాబోతున్న తమిళ్ డా - డా

Sat 30th Nov 2024 01:52 PM
pa pa movie  తెలుగులో పా-పా గా రాబోతున్న తమిళ్ డా - డా
Pa pa Movie Releasing on December 13th తెలుగులో పా-పా గా రాబోతున్న తమిళ్ డా - డా
Advertisement

తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన డా..డా చిత్రం, పా.. పా.. పేరుతో తెలుగులో విడుద‌ల‌

తెలుగు తెర‌పైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ సెన్సేష‌న‌ల్ బ్లాక్ బస్టర్ డా..డా మూవీ తెలుగులో పా.. పా.. టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుద‌ల చేయ‌బోతున్నారు. డిసెంబ‌ర్ 13న‌ ఈ చిత్రాన్నిఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

డిసెంబ‌ర్ 13న ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల

గ‌త ఏడాది త‌మిళంలో డా..డా మూవీ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్ర‌ధాన పాత్ర‌దారులుగా, డైరెక్ట‌ర్ గణేష్ కె బాబు తెర‌కెక్కించిన‌ డా..డా చిత్రం త‌మిళ ఆడియన్స్‌ని విప‌రీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన డా..డా చిత్రం పా.. పా.. పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని నిర్మాత నీరజ కోట తెలిపారు. కామెడీ, భావోద్వేగం, ప్రేమ.. ఇవ‌న్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోష‌న‌ల్ డ్రామా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా క‌నెక్టు అవుతుంద‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వడం ఖాయ‌మ‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుద‌ల చేయ‌బోతున్నార‌ని చెప్పారు.

Pa pa Movie Releasing on December 13th:

Tamil Dada Coming to Telugu as Pa pa

Tags:   PA PA MOVIE
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement