Advertisementt

మహేష్ పై రాజమౌళి స్పెషల్ ఇంట్రెస్ట్

Thu 10th Oct 2024 10:03 PM
mahesh babu  మహేష్ పై రాజమౌళి స్పెషల్ ఇంట్రెస్ట్
Rajamouli special interest in Mahesh మహేష్ పై రాజమౌళి స్పెషల్ ఇంట్రెస్ట్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ పై దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే విషయం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు బయటపెట్టారు. రీసెంట్ గా ఆయన ఓ కార్యక్రమానికి హాజరవగా అక్కడ అందరూ ఆయన్ని రాజమౌళి-మహేష్ కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుంది అనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసారు. 

దానికి విజయేంద్ర ప్రసాద్ గారు మహేష్ - రాజమౌళి మూవీ 2025 జనవరి నుంచి మొదలవుతుంది అంటూ క్రేజీ అప్ డేట్ ఇవ్వడమే కాదు, అసలు SSMB 29 ఎందుకు లేటయ్యిందో చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాము ఏ హీరోకైనా 3 నుంచి 4 వారాల్లో కథ రెడీ చేసేవాళ్ళం, కానీ మహేశ్ లాంటి స్టారో హీరో నటిస్తున్న సినిమా కావడంతో స్టోరీ రెడీ చేయడానికి రెండేళ్లు పట్టిందని విజయేంద్రప్రసాద్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 

అది విన్న మహేష్ అభిమానులు.. సూపర్ స్టార్ పై రాజమౌళి స్పెషల్ ఇంట్రెస్ట్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే మహేష్ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ లాక్ చేసినప్పటికీ రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల వలన సినిమా మొదలు కావడానికి సమయం పట్టేస్తుంది. 

Rajamouli special interest in Mahesh:

Mahesh Babu and Rajamouli SSMB29 update 

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ