Advertisement

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఆవేదన

Thu 03rd Oct 2024 05:47 PM
ntr  జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఆవేదన
Junior NTR fan is in agony జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఆవేదన
Advertisement

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు తన ఆవేదనని సోషల్ మీడియాలో ఇలా షేర్ చేసారు. 

చిరంజీవి నందమూరి తారక రామారావు గారికి.. గత కొన్ని సంవత్సరాలుగా మిమ్ములను, మీ నడతను సునిసితముగా గమనిస్తున్నాను. ఆ తారక రాముని నటనను వారసత్వంగా అందిపుచ్చుకొని కొద్దిపాటి అడుగులతో మంచి స్థాయికి వచ్చావని సంతోష పడ్డాము. కానీ ఏ కారణం చేతనో, సావాస దోషం చేతననో మీ నడతలో మార్పు కనబడుతుంది. నందమూరి వారి రక్తంలో ఇటువంటి మార్పు మాకు ఊహ తెలిసిన తర్వాత మేము చూడలేదు. 

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా. సురేఖ గారు ఏదో మాట్లాడారని, ఆ సంభాషణ వలన అక్కినేని వారి ఔన్నత్వ సంపద దెబ్బతినిందని మీరు ముందుకు వచ్చి యావత్తు సినీ పరిశ్రమ మీ వెనకే ఉన్నట్లుగా, సినీ పరిశ్రమ ప్రతినిధిగా మీరు చాలా ఆవేశపూరితంగా మాట్లాడటం చాలా బాగున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో గత పాలకుడు జగనాసురుని పరిపాలనలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీ మామయ్య గారైన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని, జగనాసురుని గణానికి చెందిన అసురులు మాట్లాడకూడని భాషలో మాట్లాడి వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తే కనీసం మీరు స్పందించలేకపోయారు. 

మీకు ఆయన పేరే పెట్టిన ఆ మహనీయుడు శ్రీ నందమూరి తారకరామారావు గారి పేరు మీదగా ఉన్న విజయవాడలోని మెడికల్ కాలేజీ కి ఉన్న శ్రీ ఎన్టీఆర్ గారి పేరును మార్చినప్పుడు మీ స్పందన సమాజం మొత్తం గమనించింది. తాత గారి పేరు మీదుగా ఉన్న వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మీ తాత గారి పేరు తీసివేస్తే మీ స్పందన లేదు. పైగా మీ తాత గారి పేరు తీసివేసిన జగనాసురుడి తండ్రి కూడా మీ తాత గారి  స్థాయి వ్యక్తి మీరు మాట్లాడటం కడు శోచనీయం. 

సమర్థత కలిగిన పరిపాలన అధ్యక్షుడు, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్ములను శ్రీ ఎన్టీఆర్ గారి మనవడుగా అభిమానించి వారి సోదరి మనవరాలుకి భర్తగా వారి కుటుంబంలోకి మిమ్ములను  ఆహ్వానించారు. శ్రీ నందమూరి తారకరామారావు గారి శత జయంతి ఉత్సవాలకి స్వయంగా మీ బాబాయి గారు శ్రీ నందమూరి రామకృష్ణ గారు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ టి. డి. జనార్ధన్ గారు స్వయంగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానించారు. 

నా పుట్టినరోజు వేడుకలు ముందుగా నిర్ణయించుకుని ఉన్నానని చెప్పారు.. మీరు కొంచెం ఆలోచించి ఉన్నట్లయితే ఆ వేదిక మీదే మీ తాత గారి శత జయంతి కేకు, మీ 40 వ పుట్టినరోజు కేకు స్వయంగా మీ చేతుల మీదుగా ఆ రెండు కేకులను కోసి అందరిని ఆనందింపజేసి,ఆ మహాసభ లోని అతిరథ  మహారధుల సమక్షంలోనే మీ తాతగారు ఉత్సవాలను అత్యంత శోభాయమానంగా జరుపుకొని ఆనందించుకొని ఉండేవారు, ఆ బంగారు అవకాశాన్ని మీరు కోల్పోయారు. 

మీ బాబాయి గారైన శ్రీ నందమూరి. బాలకృష్ణ గారి 50 సంవత్సరాల సినీ వజ్రోత్సవ వేడుకకు మీరు హాజరు కాకపోవటం కూడా బాధాకరమే. డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య ఆరోగ్యవిశ్వవిద్యాలయం పేరు మీ తాతగారు పెట్టుకోలేదు, మీ మావయ్య గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం అని పేరు పెడితే తరువాత వచ్చిన ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, నందమూరి తారకరామారావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుకు ముందు డాక్టర్ అని గౌరవ సూచికంగా పెట్టి డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం అని పేర్కొనడం జరిగింది. 

ఆ పేరును నిన్నటి జగనాసురుడు  తీసేస్తే మీరు ఏ విధంగా స్పందించారో సభ్య సమాజం మొత్తం గమనించింది.మీరు ప్రయాణం చేస్తున్న మార్గం సరైనదా కాదా అని మీకు చెప్పే పెద్దలు కూడా మీకు కరువయ్యారా. ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నందమూరి వారి వంశంలో పుట్టి మీరు నడుస్తున్న నడత చూసి, ఆ మహానుభావుడు శ్రీ నందమూరి తారకరామారావు గారికి అభిమానులమైన మేము బాధపడుచున్నాము.. మీకు ఇంకా భవిష్యత్తు ఉంది, రేపటి భవిష్యత్తులో ఎంతో ఉచ్చ స్థాయిని అందుకోవాల్సిన మీరు, మీ చేతులారా మీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారేమోనన్న బాధ మా కలుగుతున్నది. సమాజంలోనీ కొంతమంది పేర్లు పలకటానికి కూడా సభ్య సమాజం ఇబ్బంది పడేటువంటి వాళ్లతో మీరు స్నేహం చేయడం ఎంతవరకు సమంజసం మీ విజ్ఞతకే వదిలి వేస్తున్నాము.. అంటూ ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కాడు. 

Junior NTR fan is in agony:

Junior NTR fan angry with NTR attitude

Tags:   NTR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement