Advertisementt

నాని HIT: The 3rd Case రిలీజ్ డేట్ ఫిక్స్

Thu 05th Sep 2024 02:11 PM
nani  నాని HIT: The 3rd Case రిలీజ్ డేట్ ఫిక్స్
HIT: The 3rd Case Announced నాని HIT: The 3rd Case రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

 

రీసెంట్ గా నాని సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌ను కంప్లీట్ చేశారు. ఇప్పుడు తన 32వ సినిమాతో మరో మైల్ స్టోన్ జర్నీ ప్రారంభించబోతున్నారు. నాని క్యారెక్టర్ పై స్నీక్ పీక్ అందిస్తూ, గ్రిప్పింగ్ గ్లింప్స్ ద్వారా ఈరోజు HIT: The 3rd Case మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

హంటర్స్ కమాండ్ గ్లింప్స్ HIT ఆఫీసర్ మంచు పర్వతాలలో కారు నడుపుతూ, అతనిని వెంబడిస్తున్న ఇద్దరు పోలీసు ఆఫీసర్స్ తో ఇంట్రస్టింగ్ నోట్‌తో ప్రారంభమైయింది.  HIT ఆఫీసర్ దేజంర్ లో ఉన్నారని ఒక అధికారి మరొకరు హెచ్చరించడంతో టెన్షన్ బిల్డ్ అయింది. అయితే తను దేజంర్ లో లేడని, తనే డేంజర్ అని పోలీస్ ఆఫీసర్ చెప్పిన తర్వాత అర్జున్ సర్కార్ గా నాని కనిపించడం టెర్రిఫిక్ గా వుంది.  

నాని సిగార్ తాగుతూ, కారు నడుపుతూ రక్తపు చేతులు, గొడ్డలితో స్టైలిష్ అండ్ ఫెరోషియస్ గా కనిపించారు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లో ఆదరగొట్టారు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా వుండబోతోంది.  

HIT ఫ్రాంచైజీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీస్ ని అందించిన డైరెక్టర్  శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న HIT: The 3rd Case మరింత ప్రతిష్టాత్మకంగా ఉండనుంది. టీజర్ సినిమా స్టైలిష్, ఇంటెన్స్, గ్రాండ్ నెస్ ని ప్రజంట్ చేస్తోంది. HIT సిరీస్ థర్డ్ ఇన్స్టాల్ మెంట్ లో అర్జున్ సర్కార్ పాత్ర ఎంత ఇంటెన్స్ గా ఉండబోతుందో తెలుసుకోవాలనే క్యురియాసిటీని పెంచింది.

మే 1, 2025న వేసవిలో HIT 3 థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.

HIT: The 3rd Case Announced:

Nani HIT: The 3rd Case Announced

Tags:   NANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ