Advertisementt

కృష్ణాష్టమి స్పెషల్ గా కన్నప్ప అవ్రామ్ ఫస్ట్ లుక్

Fri 23rd Aug 2024 05:05 PM
avram manchu  కృష్ణాష్టమి స్పెషల్ గా కన్నప్ప అవ్రామ్ ఫస్ట్ లుక్
Avram Manchu First Look From Kannappa కృష్ణాష్టమి స్పెషల్ గా కన్నప్ప అవ్రామ్ ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్నప్ప చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు. 

కృష్ణాష్టమి సందర్భంగా మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ విడుదల కానుంది. 

ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న అవ్రామ్ ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. మంచు వారి మూడు తరాలు ఇందులో కనిపించబోతున్నాయి. మోహన్ బాబు, విష్ణు మంచు, అవ్రామ్ మంచు కలయికతో ఈ చిత్రం స్పెషల్ కానుంది. అవ్రామ్ పాత్ర, సినిమాలో లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మరో 3 రోజులు ఆగాలి.

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఇటీవలె విడుదల చేసిన టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. 

డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.

Avram Manchu First Look From Kannappa :

Avram Manchu First Look From Kannappa On Krishna Janmashtami 

Tags:   AVRAM MANCHU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ