మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ విశ్వంభర మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బిగ్ మాస్ బొనాంజాతో ముందుకు వచ్చారు.
When Myths Collide Legends Rise అనే కోట్‌తో వున్న ఈ వండర్ ఫుల్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని పవర్ ఫుల్ గా కనిపించారు. మెగాస్టార్ చరిష్మాటిక్ లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరపులతో కూడిన ఈ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.
చిరంజీవి త్రిశూలం వైపు ఇంటెన్స్ లుక్స్ తో చూస్తూ యూత్ ఫుల్ అండ్ డైనమిక్‌గా కనిపించారు. విజువల్‌గా అద్భుతమైన ఈ ఫస్ట్‌లుక్ స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలను పెంచింది.
తన డెబ్యు మూవీ బింబిసారతో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ట తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి విశ్వంభరను అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. మూవీ కోసం ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు, ఇది టాప్-నాచ్ VFX, హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌లు, అద్భుతమైన డ్రామాతో విజువల్ వండర్‌గా ఉంటుందని హామీ ఇస్తోంది.
విశ్వంభర 2025 జనవరి 10న విడుదల కానుంది.