Advertisementt

అనుబంధాలు గొప్ప బలాన్నిస్తాయి: పురాణపండ

Sun 18th Aug 2024 08:51 AM
puranapanda srinivas,manikonda  అనుబంధాలు గొప్ప బలాన్నిస్తాయి: పురాణపండ
Puranapanda Srinivas Speech at Independence Day Event అనుబంధాలు గొప్ప బలాన్నిస్తాయి: పురాణపండ
Advertisement
Ads by CJ

‘బంధాలు గాఢమైన  బలాన్నిస్తాయి ... బంధాల్ని, అనుబంధాల్ని వదులుకోకండి’, ప్రేమ, ఆత్మీయత ముందు స్వార్ధ ప్రయోజనాలు ఓడిపోతాయని,  అంతస్థులతో మనసులని, మనుషుల్ని విభజించుకోవద్దని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) చెప్పారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day Celebrations) సందర్భంగా మణికొండ (Manikonda)లోని ఒక కాలనీలో ప్రత్యేకంగా ఏర్పాటైన ఒక వేడుకలో ఆయన జాతీయ జండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అఖండ భారతదేశంలోని భగవద్గీత మూడవ అధ్యాయంలో పదహారవ శ్లోకంలో ‘ఏవం ప్రవర్తితం చక్రం’ అని శ్రీకృష్ణపరమాత్మ ఏనాడో చెప్పారని,  అశోకుని కాలంలోనే దేవనామ ప్రియః అనే అంశం మనకు ధర్మచక్ర వైభవాన్నిగుర్తుకు తెస్తుందని పేర్కొంటూ.. జాతీయ జెండాలోని పలుఅంశాలను ప్రస్తావించారు.

ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వంటి త్యాగధనుల నిస్వార్ధ అంకిత ఘట్టాలను, పింగళి వెంకయ్య.. బకించంద్ర ఛటర్జీ, రవీంద్రనాధ్ టాగోర్‌ల  జాతీయ స్ఫూర్తి అంశాలను పురాణపండ స్పష్టంగా, ఆసక్తి దాయకంగా వివరించారు.

మున్ముందుగా కాలనీ యువతులైన మాతృమూర్తుల వందేమాతరం, చివరిగా జనగణమన బృందంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. పురాణపండ శ్రీనివాస్ రసభరిత ఆలోచనాత్మక ప్రసంగం అందరినీ ఆకట్టుందనడంలో సందేహాలనవసరం. కార్యక్రమంలో రవివర్మ, రమేష్, శ్రీనివాస్, రవిప్రసాద్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు, కాలనీ వాసులు ఈ వేడుకలో ఆసక్తికరంగా పాల్గొన్నారు. ఈ వేడుకలో జస్టిస్ డివిఆర్ వర్మకి, కాలనీ నిర్మాణాత్మక సూత్రధారి సత్యనారాయణకు కృతజతలు చెప్పడం విశేషం.

Puranapanda Srinivas Speech at Independence Day Event :

Puranapanda Great Speech at Manikonda Independence Day Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ