Advertisementt

సూర్య కంగువ ట్రైలర్ రిలీజ్

Mon 12th Aug 2024 03:29 PM
kanguva trailer  సూర్య కంగువ ట్రైలర్ రిలీజ్
Suriya Kanguva Trailer Review సూర్య కంగువ ట్రైలర్ రిలీజ్
Advertisement
Ads by CJ

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువ. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మెస్మరైజింగ్ మేకింగ్ తో కంగువ ట్రైలర్ ఆకట్టుకుంది.

కంగువ ట్రైలర్ లోకి వెళితే - ఒక అందమైన దీవిని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. రహస్యాలెన్నో ఆ దీవిలో దాగిఉన్నాయి. యుద్ధాలు, ఆక్రమణలు చేస్తూ ఎదురొచ్చిన వారిని క్రూరంగా చంపే భయంకరమైన విలన్ గా బాబీ డియోల్ కనిపించారు. అతనే ఒక సైన్యం లాంటి కంగువ పాత్రలో సూర్య మేకోవర్, ఫెరోషియస్ పర్ ఫార్మెన్స్ ట్రైలర్ కు హైలైట్ గా నిలుస్తోంది. 

నాయకుడిగా తన వారిని కాపాడుకునేందుకు కంగువ చూపించే ధీరత్వం, చేసే సాహసోపేత పోరాటాలు చూపు తిప్పుకోలేకుండా ఉన్నాయి. భారీ నౌకలపై జరిగే యుద్ధ సన్నివేశాలు వరల్డ్ సినిమాను గుర్తుచేసేలా ఉన్నాయి. హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

Suriya Kanguva Trailer Review:

Kanguva Trailer Released 

Tags:   KANGUVA TRAILER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ