ప్రాజెక్టు విశిష్ఠతలు
పేరు: మై హోమ్ అక్రిద
లొకేషన్: గోపనపల్లి
స్థల విస్తీర్ణం: 24.99 ఎకరాలు
టవర్ల సంఖ్య: 12, జి+39 అంతస్తులు
ఓపెన్ ఏరియా: 81 శాతం
ఫ్లాట్ల సంఖ్య: 3780
క్లబ్‌హౌజ్‌లు: 2
హైదరాబాద్‌లో అనేక మంది ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు. కానీ, కొందరు మాత్రమే సంతోషాన్ని పంచే గృహాల్ని అందజేస్తారు. నివాసితులకు ప్రశాంతతను అందించే ఆవాసాల్ని తీర్చిదిద్దుతారు. మరి, సుఖసంతోషాల్ని అందజేసే అద్భుతమైన ప్రాజెక్టుల్ని నిర్మిస్తారన్న ఖ్యాతినార్జించిన మై హోమ్ గ్రూప్ నుంచి జాలువారిన మరో మహత్తరమైన ఆకాశహర్మ్యమే.. మై హోమ్ అక్రిద. గచ్చిబౌలి విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు చేరువలోని గోపనపల్లిలో.. సుమారు 24.99 ఎకరాల్లో డిజైన్ చేసిన.. ప్రీమియం లైఫ్ స్టయిల్ అపార్టుమెంట్స్‌ను.. జి ప్లస్ 39 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చే 12 హైరైజ్ టవర్లు దేనికవే సాటిగా నిలుస్తాయి. ప్రాజెక్టు మొత్తం 81 శాతం ఖాళీగా ఉండేలా డిజైన్ చేసిన.. మై హోమ్ అక్రిదాలో మొత్తం వచ్చేవి.. సుమారు 3780 ఫ్లాట్లు. ఇందులోని 2. 2.5, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు ప్రతిఒక్కర్ని ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సైజుల విషయానికి వస్తే.. టూ బెడ్రూమ్ ఫ్లాట్ 1399 చదరపు అడుగుల నుంచి ఆరంభమవుతుంది. రెండున్నర పడక గదుల ఫ్లాట్ అయితే 1622 చదరపు అడుగులు, ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్ అయితే 1926, 2012, 2262, 2347 ఎస్ఎఫ్‌టీలో దొరుకుతాయి.
మై హోమ్ ఎక్కడైనా ఒక ప్రాజెక్టును ఆరంభించిందంటే.. ఆ ప్రాజెక్టుకు పేరు పెట్టే విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపెడుతుంది. గోపనపల్లి ప్రాజెక్టుకు అక్రిద అని పేరు పెట్టింది. మరి, దీనికి అర్థం సెంటర్ ఆఫ్ జాయ్. అంటే, ఇందులో నివసించేవారు ఎప్పటికీ సంతోషంగా, ప్రశాంతంగా నివసిస్తారు. అంతేకాదు, ప్రాజెక్టు పరిసరాలు సైతం సంతోషకరమైన ప్రజలతోనే నిండుతుంది. అందుకే, మై హోమ్ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టును చూస్టే చాలు.. మీరు ఒక్కసారిగా అక్రిద ప్రేమలో పడతారనే విషయంలో సందేహం లేదు. మీరొక్కసారి ఈ ప్రాజెక్టులో అలా నడుచుకుంటూ వెళితే చాలు.. ప్రతిఒక్క మూలభాగం మీకు సరికొత్త ఆనందాన్ని అందజేస్తుంది. ఒక ప్రీమియం కమ్యూనిటీలో నివసిస్తున్నామన్న అనుభూతి కలగడంతో పాటు సురక్షితంగా ఉన్నారన్న సంకేతాన్ని అందజేస్తుంది. అందుకే, మై హోమ్ కొత్త ప్రాజెక్టులంటే చాలు.. దేశ, విదేశీ బయ్యర్లకు ఎక్కడ్లేని భరోసా అని చెప్పొచ్చు.
రెండు క్లబ్ హౌజ్‌లు..
మై హోమ్ అక్రిద ప్రాజెక్టును సుమారు 24.49 ఎకరాల్లో నిర్మిస్తుండటంతో.. నివాసితులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో.. రెండు క్లబ్ హౌజులకు మై హోమ్ సంస్థ స్థానం కల్పించింది. మొదటి క్లబ్ హౌజ్‌ను సుమారు యాభై ఎనిమిది వేల చదరపు అడుగుల్లో.. జి ప్లస్ 4 అంతస్తుల ఎత్తులో డిజైన్ చేసింది. ఇందులో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసింది. రెండో క్లబ్ హౌజ్‌ను సుమారు 47 వేల చదరపు అడుగుల విస్తీర్షంలో, జి ప్లస్ 3 అంతస్తులో ఎత్తులో నిర్మిస్తోంది. మొత్తానికి, పరిపూర్ణ ప్రశాంతతో కూడుకున్న విశ్రాంతిని కావాలని కోరుకునేవారికి చక్కగా నచ్చే ప్రాజెక్టే.. మై హోమ్ అక్రిద.