ఇండియా వాణిజ్య నగరం ముంబైలో భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మార్టిన్ ట్రైలర్‌ను గ్రాండ్ రిలీజ్ చేశారు. ధృవ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకకు ఇండియాలోని టాప్ క్రిటిక్స్, జర్నలిస్టులు హాజరయ్యారు. ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచ వేదికపై భారతీయ చిత్రాలకు సంబంధించిన కొత్త కోణాలను, అవకాశాలను అద్భుతంగా హైలైట్ చేస్తూ ప్రదర్శించారు. మార్టిన్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ ట్రైలర్ అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భవిష్యత్ సినిమాకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేలా సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
మార్టిన్ మూవీ ట్రైలర్‌ను గ్రాండ్ లెవల్లో విడుదల చేయటానికి కారణం విజువల్‌గా ఇండియన్ సినిమా ఎంత గొప్ప సినిమాలను రూపొందిస్తుందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయటమే. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుక భారతీయ సినిమా అభివృద్ధి చెందిన తీరుని, ఆ ప్రభావం ఇతర సినిమాలపై ఎలా ఉందనే విషయాన్ని బలంగా చెప్పటమే. అంతే కాకుండా నిర్మాతలు అన్‌కాంప్రమైజ్డ్‌గా అంతర్జాతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను నిర్మించారనే విషయాన్ని స్పష్టం చేయటమే ఈ వేడుక ఉద్దేశం.
ప్రపంచ సినిమాలో మన ఇండియన్ సినిమా ప్రభావాన్ని, సృజనాత్మకతను బలంగా చెప్పటమే ఈ ఈవెంట్ లక్ష్యం. భారతీయ సినిమాలో ఇది కొత్త శకాన్ని సూచిస్తుంది.