Advertisementt

ఇండియన్ 2 ఓటీటీ డేట్ ఫిక్స్

Sun 04th Aug 2024 12:27 PM
bharateeyudu 2  ఇండియన్ 2 ఓటీటీ డేట్ ఫిక్స్
Indian 2 OTT Date Fix ఇండియన్ 2 ఓటీటీ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం భార‌తీయుడు 2. ప్రపంచ వ్యాప్తంగా జులై 12న ఈ చిత్రం విడుదలైంది. భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌. 

ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా ఇప్పుడు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఆగ‌స్ట్ 9న ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ కానుంది. త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భార‌తీయుడు 2 అల‌రించ‌నుంది. 

క‌మ‌ల్ హాస‌న్ అద్భుత‌మైన న‌ట‌న‌, శంక‌ర్ టేకింగ్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రంగా భార‌తీయుడు 2 అల‌రించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కానుంది. లంచ‌గొండుల‌పై ఇండియ‌న్ తాత ఎలా పోరాటం చేశాడ‌నే క‌థాంశంతో రూపొందిన భార‌తీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌. సిద్ధార్థ్‌, ఎస్‌.జె.సూర్య‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, గుల్ష‌న్ గ్రోవ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

Indian 2 OTT Date Fix:

Bharateeyudu 2 in is coming to NetflixIndia on 9th August

Tags:   BHARATEEYUDU 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ