Advertisementt

వయనాడ్ బాధితుల కోసం రష్మిక విరాళం

Sat 03rd Aug 2024 04:38 PM
rashmika mandanna  వయనాడ్ బాధితుల కోసం రష్మిక విరాళం
Rashmika generously donates Rs. 10 lakhs to Wayanad Landslide Relief Efforts in Kerala వయనాడ్ బాధితుల కోసం రష్మిక విరాళం
Advertisement
Ads by CJ

బ్లాక్ బస్టర్ మూవీస్ తో పాన్ ఇండియా క్వీన్ గా పేరు తెచ్చుకుంది రశ్మిక మందన్న. సోషల్ ఇష్యూస్ పై స్పందించే రశ్మిక పలు సందర్భాల్లో తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఆమె మరోసారి తన మంచి మనసు చాటుకుంది. కేరళ వయనాడ్ లో ఇటీవల కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాధం పట్ల రశ్మిక మందన్న తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. 

ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొంది. రశ్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ సినిమాతో పాటు బాలీవుడ్ మూవీ సికిందర్ లో నటిస్తోంది. ఆమె ఖాతాలో ది గర్ల్ ఫ్రెండ్ అనే ఇంట్రెస్టింగ్ మూవీ కూడా ఉంది.

Rashmika generously donates Rs. 10 lakhs to Wayanad Landslide Relief Efforts in Kerala:

Rashmika Mandanna generously donates Rs. 10 lakhs to Wayanad Landslide Relief Efforts in Kerala

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ