మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరిచయం అక్కర్లేని పేరు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనదైన ముద్రవేశారీ అగ్ర కథానాయకుడు. తెలుగులోనూ మహానటి, సీతారామం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఈయన అలరించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా విడుదలైన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీలోనూ అతిథి పాత్రలోనూ దుల్కర్ అలరించారు. ఇప్పుడు ఈయన కథానాయకుడిగా తెలుగులో ఓ సినిమా ప్రారంభమైంది.
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు దుల్కర్ సల్మాన్ ఇప్పుడు యూనిక్ సినిమాలు, విలక్షణమైన కథాంశాలతో దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న పవన్ సాధినేనితో చేతులు కలిపారు. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఆకాశంలో ఒక తారగా తెరకెక్కబోతున్న ఈ మూవీ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్ లుక్ చాలా సింపుల్‌గా ఉంది. ఓ రైతులా కనిపిస్తున్నారు. అదే పోస్టర్‌లో ఓ అమ్మాయి స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళుతుండటాన్ని చూడొచ్చు. దుల్కర్ మరో డిఫరెంట్ రోల్‌తో అలరించబోతున్నారనే విషయం పోస్టర్ ద్వారా స్పష్టమైంది. ఆడియెన్స్‌లో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. హృదయాన్ని హత్తుకునే ఎంటర్‌టైనర్‌గా సినిమా మెప్పించనుందనే విషయం స్పష్టమవుతుంది.