Advertisementt

మెగాస్టార్ ఇంద్ర రీ-రిలీజ్

Wed 24th Jul 2024 05:37 PM
indra  మెగాస్టార్ ఇంద్ర రీ-రిలీజ్
Indra Grand Release On August 22 మెగాస్టార్ ఇంద్ర రీ-రిలీజ్
Advertisement
Ads by CJ

సెలబ్రేషన్ అఫ్ 50 గోల్డెన్ ఇయర్స్ అఫ్ వైజయంతి మూవీస్- మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర గ్రాండ్ రీ-రిలీజ్‌

అశ్వనీ దత్ వైజయంతి మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్ ని సెలబ్రేట్ చేస్తూ, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇంద్ర గ్రాండ్ రీ-రిలీజ్‌ కానుంది. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంద్ర 2002లో జూలై 24న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది.

ఇంద్ర చిత్రం మూడు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ సౌత్‌ అవార్డులను గెలుచుకుంది. చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డు, తెలుగు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు రెండింటినీ గెలుచుకున్నారు.

చిరంజీవితో వైజయంతీ మూవీస్ అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించింది. ఇంద్ర బ్యానర్‌కు మోస్ట్ మెమరబుల్ మూవీ. ఈ చిత్రానికి VSR స్వామి సినిమాటోగ్రఫీ అందించగా, మణి శర్మ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.

Indra Grand Release On August 22:

Indra Grand Release On August 22, In Honour Of Megastar Chiranjeevi Birthday

Tags:   INDRA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ