Advertisementt

పుష్ప-2 రూమర్స్‌పై క్లారిటి

Fri 19th Jul 2024 07:28 PM
pushpa-2  పుష్ప-2 రూమర్స్‌పై క్లారిటి
Clarity on Pushpa-2 rumours పుష్ప-2 రూమర్స్‌పై క్లారిటి
Advertisement
Ads by CJ

పుష్ప-2 దిరూల్‌ విషయంలో కథానాయకుడు అల్లు అర్జున్‌- దర్శకుడు సుకుమార్‌పై  సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై  అల్లు అర్జున్‌ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌ శుక్రవారం జరిగిన ఆయ్‌ సినిమా ప్రెస్‌మీట్‌లో స్పందించారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పుష్ప-2  గురించి మీడియా లో వస్తున్న న్యూస్ లు చూసి నవ్వుకునే స్థితిలో మేమున్నాం. 

అల్లు అర్జున్ షూటింగ్‌  పార్ట్ 15 నుంచి 20రోజుల లోపు ఉంది. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి వుంది. దర్శకుడు సుకుమార్‌ ఎడిటింగ్‌ చూసుకుని ఇంకా ఏమైనా అల్లు అర్జున్‌ పార్ట్‌ బ్యాలెన్స్ వుందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్‌ పెట్టుకుందాం అన్నారు.  అల్లు అర్జున్  కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రిమ్ చేశారు. అల్లు అర్జున్ - సుకుమార్‌కు నాకు ఉన్న బాండింగ్ లైఫ్ లాంగ్ అలానే వుంటుంది. 

ఆగష్టు మొదటి వారంలో షూటింగ్‌  మొదలవుతుంది పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిలిం ని సింపుల్ గా ఎందుకు తీసుకుంటారు అంటూ సోషల్ మీడియా లో పుష్ప 2 పై వస్తోన్న రూమర్స్ పై బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు. 

Clarity on Pushpa-2 rumours:

Bunny Vas clarity on Pushpa-2 rumours

Tags:   PUSHPA-2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ