Advertisementt

తంగలాన్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Fri 19th Jul 2024 05:46 PM
thangalaan  తంగలాన్ రిలీజ్ డేట్ వచ్చేసింది
Thangalaan releasing worldwide on Independence Day తంగలాన్ రిలీజ్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ తంగలాన్ రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. తంగలాన్ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తంగలాన్ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన తంగలాన్ సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మనకి మనకి.. లిరికల్ సాంగ్ కూడా ఛాట్ బస్టర్ అయ్యింది. రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడం తంగలాన్ మూవీ మీద ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తంగలాన్ ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగించనుంది.

Thangalaan releasing worldwide on Independence Day:

Thangalaan releasing worldwide on August 15

Tags:   THANGALAAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ