Advertisementt

BMSలో ఆల్-టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన కల్కి

Thu 18th Jul 2024 05:47 PM
prabhas  BMSలో ఆల్-టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన కల్కి
Kalki 2898 AD Creates An All-Time Record On BMS BMSలో ఆల్-టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన కల్కి
Advertisement
Ads by CJ

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మాగ్నం ఓపస్ కల్కి 2898 AD రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆదరగొడుతోంది.

తాజాగా కల్కి 2898 AD  టిక్కెట్టు పోర్టల్ BookMyShow సేల్స్ లో ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించింది. 12.15 మిలియన్+ టిక్కెట్ సేల్స్ తో పోర్టల్‌లో హయ్యస్ట్ సేల్స్ మూవీగా ఇప్పుడు కల్కి నిలిచింది. 12.01 మిలియన్ల టిక్కెట్ సేల్స్ తో జవాన్ గతంలో బెస్ట్ గా ఉంది. సైన్స్ ఫిక్షన్  మాగ్నం ఓపస్ కల్కి కేవలం 20 రోజుల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టింది.

మంగళవారం గవర్నమెంట్ హాలీడే కావడంతో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. నాల్గవ వీకెండ్ లో అద్భుతంగా పిక్ అప్ అవుతోంది, వీక్ డేస్ లో కూడా సినిమా చాలా స్టడీగా ఉంది.

వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ వెంచర్ కల్కి జోరు తగ్గడం లేదు, రిపీట్ వాల్యూతో సినిమా లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో కల్కి మరికొన్ని రికార్డులను బద్దలు కొట్టనుంది.

Kalki 2898 AD Creates An All-Time Record On BMS:

Prabhas Kalki 2898 AD Creates An All-Time Record On BMS

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ