Advertisementt

లక్కీ భాస్కర్ డేట్ మారింది

Mon 08th Jul 2024 07:46 PM
dulquer salmaan  లక్కీ భాస్కర్ డేట్ మారింది
Lucky Baskhar to release on 7th September లక్కీ భాస్కర్ డేట్ మారింది
Advertisement
Ads by CJ

తెలుగులో మహానటి, సీతా రామం వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న దుల్కర్, ఇప్పుడు లక్కీ భాస్కర్ అనే మరో వైవిధ్యమైన పీరియడ్ డ్రామా చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. 1980-90 ల కాలంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని లక్కీ భాస్కర్ చిత్రంలో చూడబోతున్నాం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 27 న విడుదల చేయాలనుకున్నారు. 

కానీ ఆ తేదికి ఎన్టీఆర్ దేవర వస్తూ ఉండడంతో ఇప్పుడు లక్కీ భాస్కర్ ని కాస్త ముందుగా అంటే సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

లక్కీ భాస్కర్ చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం కోసం నిర్మాతలు 80ల నాటి ముంబై నగరాన్ని హైదరాబాద్‌లో భారీ సెట్‌లతో పునర్నిర్మించారు. అలాగే ఆ కాలం నాటి బ్యాంకులను పోలి ఉండే భారీ బ్యాంక్ సెట్‌ను కూడా రూపొందించారు. 

Lucky Baskhar to release on 7th September:

Dulquer Salmaan Lucky Baskhar to release on 7th September!

Tags:   DULQUER SALMAAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ