ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్, మచ్ ఎవైటెడ్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు, టీజర్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత టీం ఇప్పుడు ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్‌తో మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించింది.
స్టెప్పా మార్ ట్రూలీ మాస్ డ్యాన్స్, రిథమ్, హై ఎనర్జీని సెలబ్రేట్ చేసుకునే సాంగ్. ఉస్తాద్ రామ్ పోతినేని అద్భుతమైన పెర్ఫార్మెన్స్, పూరి జగన్నాధ్ స్టైలిష్ టేక్ విజువల్ మాస్ ఫీస్ట్ లా వుంది. వోకల్స్, లిరిక్స్ లిజినర్స్ కి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇన్ఫెక్షియస్ బీట్‌లు, ఆకట్టుకునే లిరిక్స్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తూ స్టెప్పామార్ మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.