Advertisementt

కల్కి తో కళకళలాడుతున్న థియేటర్స్

Thu 27th Jun 2024 06:12 PM
kalki 2898ad  కల్కి తో కళకళలాడుతున్న థియేటర్స్
Theaters Buzzing with the Release Kalki 2898AD కల్కి తో కళకళలాడుతున్న థియేటర్స్
Advertisement
Ads by CJ

రెబెల్ స్టార్ కల్కి సినిమా గ్రాండ్ రిలీజ్ తో మళ్లీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్స్ కళకళలాడుతున్నాయి. నిన్నటి నుంచే కల్కి సినిమా థియేటర్స్ దగ్గర సందడి మొదలైంది. ఏ,బీ,సీ సెంటర్స్ మల్టీప్లెక్సులు అనే తేడా లేకుండా అన్ని థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కల్కి సినిమా ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సమ్మర్ ముందు నుంచి ప్రేక్షకులు లేక వెలవెలబోయిన థియేటర్స్ ఇప్పుడు హౌస్ ఫుల్ బోర్డులతో సందడిగా మారాయి. 

కల్కి రిలీజ్ తో ఎగ్జిబిటర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సకుటుంబంగా ప్రేక్షకులు కల్కి సినిమా చూసేందుకు థియేటర్స్ కు వెళ్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో టికెట్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. 

రికార్డ్ స్థాయిలో స్క్రీన్స్ ఉన్నా..టికెట్స్ దొరకనంత క్రేజ్ తో కల్కి ప్రదర్శితమవుతోంది. మైథాలజీ సైఫైగా కల్కి సినిమాను అద్భుతంగా రూపొందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు, హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించిన వైజయంతీ మూవీస్ కు అందరి దగ్గర నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Theaters Buzzing with the Release Kalki 2898AD:

Theaters Buzzing with the Release of Magnum Opus Kalki 2898AD

Tags:   KALKI 2898AD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ