Advertisementt

థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

Tue 25th Jun 2024 08:52 PM
kalki 2898 ad  థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో
Kalki 2898 AD Theme Song out థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో
Advertisement
Ads by CJ

భారీ అంచ‌నాల మ‌ధ్య మ‌రో రెండు రోజుల్లో క‌ల్కి 2898 ఏడీ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. దానికి తోడు... ప్ర‌మోష‌న్ కంటెంట్‌తో చిత్ర‌బృందం ఆ అంచ‌నాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు రెట్టింపు చేస్తోంది. తాజాగా థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ డియోని విడుద‌ల చేశారు. సంతోష్ నారాయ‌ణ్ స్వ‌ర ప‌ర‌చిన ఈ గీతాన్ని కాల‌భైర‌వ రాగ యుక్తంగా, భావోద్వేగంగా ఆల‌పించారు. ఆస్కార్ విజేత చంద్ర‌బోస్ త‌న అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. 

క‌ల్కి 2898 ఏడీ చిత్ర సారాంశం, పాత్ర‌ల తాలుకూ నేప‌థ్యం, వాటి సంఘ‌ర్ష‌ణ ఇవ‌న్నీ... చంద్ర‌బోస్ త‌న సాహిత్యంలో పొందుప‌రిచిన‌ విధానం శ్రోత‌ల‌ను అబ్బుర ప‌రుస్తోంది. ఇటీవ‌ల ఈ పాట‌ని మ‌ధుర‌లో ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కృష్ణుడి జ‌న్మ స్థ‌లంలో ఈ పాట ని ప‌రిచ‌యం చేయ‌డం, ఈ పాట‌లో కృష్ణుడి శ‌క్తియుక్తుల్ని అక్ష‌రాలలో మ‌ల‌చ‌డం కాక‌తాళియం కాదు. ప్ర‌ముఖ న‌టి, న‌ర్త‌కి శోభ‌నా చంద్ర‌కుమార్‌ ఈ పాట కోసం గ‌జ్జె క‌ట్ట‌డం వీక్ష‌కుల‌కు మ‌రింత హాయిని క‌లిగించింది. ఆ దృశ్యం క‌నుల పండుగ‌లా క‌నిపించింది.

Kalki 2898 AD Theme Song out:

Kalki 2898 AD Theme Song; An Ode to Lord Krishna Released

Tags:   KALKI 2898 AD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ