Advertisementt

కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్

Fri 21st Jun 2024 09:09 PM
kalki 2898 ad  కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్
Kalki 2898 AD Release Trailer Unveils కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్
Advertisement
Ads by CJ

కల్కి 2898 AD ఫస్ట్ ట్రైలర్ మ్యాసీవ్ రెస్పాన్స్ తో గ్లోబల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఆడియన్స్ ఎంతోగానో ఎదురుచూస్తున్న రిలీజ్ ట్రైలర్ ఇప్పుడు విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ గ్లింప్స్ భారతీయ పురాణాలలో రూట్ అయిన కల్కి 2898 AD సినిమాటిక్ యూనివర్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తే, తాజా ట్రైలర్ ఇంకా డీప్ గా ఎపిక్ నెరేటివ్ ని మహా అద్భుతంగా చూపింది. 

ట్రైలర్ వారి అద్భుతమైన అవతారాలలో లార్జర్ దెన్ లైఫ్ హీరోలను ప్రజెంట్ చేసింది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా డేరింగ్ స్టంట్స్ ని పెర్ఫామ్ చేశారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ యాస్కిన్ గా గుర్తించలేని డెడ్లీ అవతార్‌లో కనిపించారు. బుజ్జితో కలిసి ప్రభాస్ భైరవగా బౌంటీ హంట్ లో అదరగొట్టారు. దీపికా పదుకొణె సుమతి పాత్రను పోషించింది, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన పాత్రలో ఇంటెన్స్ ఛాలెంజస్ ని ఎదుర్కొంటుంది. దిశా పటానీ రాక్సీగా పవర్ ఫుల్ ప్రెజెన్స్‌ తో ఆకట్టుకుంది. 

ట్రైలర్ కల్కి 2898 ADలోని మూడు డిఫరెంట్ వరల్డ్స్ ని పరిచయం చేసింది. కాశీ, మనుగడ కోసం పోరాడుతున్న చివరిగా మిగిలిన నగరం; కాంప్లెక్స్, ఉన్నత వర్గాలచే నియంత్రించబడే ఆకాశంలో ఒక స్వర్గం; మూడోది శంబాలా, కాంప్లెక్స్ ద్వారా హింసించబడిన వారికి ఆశ్రయం అందించే ఒక ఆధ్యాత్మిక భూమి. 

అవుట్ స్టాండింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టాప్ క్లాస్ VFX , బ్రీత్ టేకింగ్ విజువల్స్‌తో ఈ మూవీ ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ గా నిలిచింది. 

కల్కి 2898 AD దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీ అప్రోచ్, అద్భుతమైన విజువల్స్, స్టొరీ టెల్లింగ్ తో ఇండియన్ సినిమాని రిడిఫైన్ చేయగలదని ప్రామిస్ చేస్తోంది. ట్రైలర్ లో మహాభారతానికి సంబంధించిన రిఫరెన్స్ స్టాండ్ అవుట్ మూమెంట్ గా నిలిచింది. 

కల్కి 2898 AD ట్రూలీ పాన్-ఇండియన్ మూవీ, దేశవ్యాప్తంగా ఉన్న టాప్ ట్యాలెంటెన్స్ ని ఒకచోట చేర్చింది. 

Kalki 2898 AD Release Trailer Unveils:

Kalki 2898 AD Release Trailer out

Tags:   KALKI 2898 AD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ