Advertisementt

కల్కి ఎపిక్స్ అన్నిటికీ అల్టిమేట్ క్లైమాక్స్

Tue 18th Jun 2024 06:37 PM
kalki 2898 ad  కల్కి ఎపిక్స్ అన్నిటికీ అల్టిమేట్ క్లైమాక్స్
Nag Ashwin interview కల్కి ఎపిక్స్ అన్నిటికీ అల్టిమేట్ క్లైమాక్స్
Advertisement

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ కల్కి 2898 AD ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న విడుదలైన భైరవ అంథమ్ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్ లో వుంది. ఈ ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచుతూ మేకర్స్ ఎపిక్ జర్నీ ఎపిసోడ్ 1 - ది ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి2898AD ని రిలీజ్ చేశారు. 

ది ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి2898AD వీడియోలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ కథ బేసిక్ గా అన్నిటికి క్లైమాక్స్. కలియుగంలో ఏం జరుగుతుంది. ఏం జరగొచ్చు .. ఇలాంటి వాటన్నిటికీ ఇది క్లైమాక్స్‌. కేవలం ఇండియన్ లోనే కాదు వరల్డ్ లో అందరూ ఈ కథకు రిలేట్ అవుతారు. చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టం. పాతాళభైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 నాకు ఇష్టమైన సినిమాలు. హాలీవుడ్‌ స్టార్‌ వార్స్ లాంటి సినిమా చూసినప్పుడు చాలా బావున్నాయనిపించాయి. అయితే ఇవి మన కథలు కావా? ఎప్పుడూ వెస్ట్ లోనే జరగాలా ? అనిపించేది.  

మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. కృష్ణవతారంతో అది ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి కలియుగంకు ఎంటరైనప్పుడు ఈ కథ ఎలా వెళుతుందనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్. దిన్ని కథగా రాయలనుకున్నా. మనం చదివిన పురాణాలు, ఎపిక్స్ అన్నిటికి ఒక క్లైమాక్స్ లా వుంటుంది. ప్రతి యుగంలో కలిపురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఒక యుగంలో రావణుడు, మరోయుగంలో దుర్యోధనుడు... ఇలా అన్నిట్లో ఒక రూపం తీసుకొని కలియుగంలో ఒక అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే అతనితో పోరాటం ఎలా వుంటుందనే ఐడియాతో రాసుకున్నది. ఈ కథ రాయడానికి 5 సంవత్సరాలు పట్టింది. సరికొత్త ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ అటెంప్ట్ ని చూసి ప్రేక్షకుల ఎలా రియాక్ట్ అవుతారని క్యూరియస్ ఎదురుచూస్తున్నా అన్నారు.

Nag Ashwin interview:

Nag Ashwin interview about Kalki 2898 AD

Tags:   KALKI 2898 AD
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement