Advertisementt

డిసెంబర్ కి వెళ్ళిపోయిన పుష్ప-2 దిరూల్‌

Mon 17th Jun 2024 08:56 PM
pushpa 2: the rule  డిసెంబర్ కి వెళ్ళిపోయిన పుష్ప-2 దిరూల్‌
Pushpa 2 to Hit Theatres Worldwide on December 6th, 2024 డిసెంబర్ కి వెళ్ళిపోయిన పుష్ప-2 దిరూల్‌
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా పుష్ప 2 ద రూల్ పోస్ట్ పోన్.. ఆగష్టు 15 న పుష్ప 2 రావడం లేదు అంటూ జరుగుతున్న ప్రచారానికి మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఆగష్టు 15 కి అనివార్య కారణాలతో పుష్ప 2 ని విడుదల చెయ్యలేకపోతున్నామంటూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. 

పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది.

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు..

ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ పుష్పకు కంటిన్యూగా రాబోతోన్న పుష్ప 2: ది రూల్ పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే.. పుష్ప ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. పుష్ప -2 చిత్రం నుంచి ఏ అప్‌డేట్‌ వచ్చినా, ఎలాంటి ప్రమోషన్‌ కంటెంట్‌ విడుదలైన రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్లింది. టీజర్‌తో పాటు ఇటీవల విడుదలైన పుష్ప పుష్ప పుష్పరాజ్‌, టైటిల్‌ సాంగ్‌, కపుల్‌ సాంగ్‌గా విడుదలైన రెండో లిరికల్‌ సాంగ్‌ సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ.. ఎంతటి రికార్డులు క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  

అయితే మొదట ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకవస్తున్నామని ప్రకటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 6,  2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. షూటింగ్‌ పార్ట్‌తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా, టెక్నికల్‌గా మరింత అత్యున్నత విలువలతో, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలనే వుద్దేశంతో సినిమా విడుదల తేదిని మార్చినట్లు తెలిపారు మేకర్స్‌.

Pushpa 2 to Hit Theatres Worldwide on December 6th, 2024:

Pushpa 2: The Rule to Hit Theatres Worldwide on December 6th, 2024!

Tags:   PUSHPA 2: THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ