ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో చాలా గొప్ప మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నా మిత్రుడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గారు సాధించిన గొప్ప విజయానికి అభినందనలు తెలియచేస్తున్నాను. పది సంవత్సరాల పవన్ కష్టాన్ని ప్రజలు ఆదరించారు.
నేనెప్పుడు ఒకమాట చెప్తుంటా అది రాజకీయం కావచ్చు, సినిమా కావచ్చు... ప్రజలే న్యాయనిర్ణేతలు వారిచ్చిన తీర్పే ప్రతి ఒక్కరు గౌరవించాలి అని. డిప్యూటి సీయంగా కొత్త బాధ్యతలు తీసుకున్న పవన్‌కళ్యాణ్ సినిమా రంగంలో మాదిరిగానే సంచలనాలు సృష్టించే పవర్‌స్టార్‌లా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని మనసారా కోరుకుంటున్నా.
మీ అలీ