Advertisementt

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే దేవర అప్ డేట్

Thu 13th Jun 2024 05:17 PM
devara  ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే దేవర అప్ డేట్
Devara releasing worldwide grandly on September 27th ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే దేవర అప్ డేట్
Advertisement
Ads by CJ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర చిత్రం కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో అత్య‌ద్భుతంగా, శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ చేస్తూ అక్టోబర్ 10 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. 

ఇప్పుడు గురువారం చిత్ర యూనిట్ దేవర మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ప్రేక్ష‌కుల‌కు ఈ హై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌టానికి దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో తొలి భాగం దేవర:  పార్ట్ 1, సెప్టెంబ‌ర్ 27న తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లకానుంది. ఎంటైర్ ఇండియాలోని సినీ ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునేలా ఈ పాన్ ఇండియా భారీ చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి ఇదే క‌రెక్ట్ డేట్ అని మేక‌ర్స్ భావిస్తున్నారు.

తాజా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌తో దేవర చిత్రంపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ఎన్టీఆర్ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజ‌న్స్‌, కొర‌టాల శివ టేకింగ్‌ను ఎప్పుడెప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు,ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 10 కన్నా ముందే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ దేవర కొత్త డేట్ కిక్ ఇవ్వబోతుంది. 

Devara releasing worldwide grandly on September 27th:

Man of Masses NTR Devara releasing worldwide grandly on September 27th

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ