స్వచ్చదంగా నీలి మీడియా ని బ్యాన్ చేస్తున్న క్యేబుల్ ఆపరేటర్లు.
రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి ని దెబ్బతీసే విధంగా వార్తలు వండి వార్చడంతో కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం.
ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన ఫేక్ పేపర్ సాక్షి సర్కులేషన్.
ఆంధ్రప్రదేశ్ లో సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్ అయ్యాయి. స్వచ్చదంగా నీలి మీడియా ని బ్యాన్ చేస్తున్నారు క్యేబుల్ ఆపరేటర్లు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి ని దెబ్బతీసే విధంగా వార్తలు వండి వార్చడంతో కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఓ లు రాష్ట్ర అభివృద్ధి కి ఆటంకం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రం లో అధికారం మారి 48 గంటలు గడుస్తున్నా ఆయా ఛానెల్స్ యజమానుల తీరు మారకపోవడం, అందులో పనిచేసే పెయిడ్ జర్నలిస్టులు, యాంకర్లు ఇంకా రాష్ట్రం పై విషం చిమ్మడం, కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే వ్యతిరేక వార్తల తో రెచ్చిపోవడం, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా వార్తలు వండి వార్చడం వంటి అంశాలను కేబుల్ ఆపరేటర్లు సీరియస్ గా తీసుకున్నారు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసారు. ఇప్పుడు కూడా మారకపోతే ఎలా అంటూ స్వచ్ఛందంగా ఆయా ఛానెల్స్ ని బంద్ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఫైబర్ గ్రిడ్ లో కూడా ఈ ఛానెల్స్ తక్షణమే ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన ఫేక్ పేపర్ సాక్షి సర్కులేషన్ పడిపోయిన వార్త కూడా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, వాలంటీర్లు ఇలా అందరూ సాక్షి చదవాలి అని ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసి 12 లక్షల ఫేక్ సర్కులేషన్ ను అధికంగా చూపించారు. ఇప్పుడు అధికారులు ప్రభుత్వం మారడంతో మరు క్షణమే సాక్షి కనపడితే కాళ్లు విరగ్గొడతామ్ అని కింది స్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీ చేసారు. దాంతో ఒకే రోజు సాక్షి 12 లక్షల సర్కులేషన్ కోల్పోయింది.