Advertisementt

టుక్‌ టుక్‌ ఫస్ట్‌లుక్‌

Tue 21st May 2024 11:04 AM
tuk tuk  టుక్‌ టుక్‌ ఫస్ట్‌లుక్‌
Tuk Tuk First Look టుక్‌ టుక్‌ ఫస్ట్‌లుక్‌
Advertisement
Ads by CJ

చిత్రవాహిని మరియు ఆర్‌వైజి బ్యానర్‌లు తమ తాజా చలనచిత్రం టైటిల్‌ టుక్‌ టుక్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని శ్రీ రామనవమి సందర్భంగా విడుదల చేశారు. విచిత్రమైన ఆటో ఈ పోస్టర్‌ చాలా ఆకర్షణీయంగా ఉంది. చూడడానికి ఏదో ఫాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్‌ లుక్‌ ఉంది. సుప్రీత్‌ సి. కృష్ణ దర్శకత్వం వహించిన, ఈ ‘టుక్‌ టుక్‌’ ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్‌ అనుభూతిని అందిచేలా ఉంది. హీరోలు హర్ష రోషన్‌, కార్తికేయ దేవ్‌, స్టీవెన్‌ మధులు ఓ ఆటో బొమ్మను ఎంతో ఆసక్తిగా చూస్తుండడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. అసలు ఆ ఆటో ఏమిటి? ఈ ఆటోకు ఈ చిత్ర కథలో ఉన్న ప్రాధాన్యం ఏమిటి? అనే ఆసక్తిని వీక్షకులకు కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే.. రాబోయే రోజుల్లో మేకర్స్‌ ఇచ్చే అప్డేట్స్‌ వరకూ ఊపిరి బిగబట్టుకుని వెయిట్‌ చేయాల్సిందే. 

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఉన్న కంటెంట్‌ను బట్టి ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో సెట్‌ చేయబడిరది అని అర్ధమౌతుంది. అనేక ఫాంటసీ ఎలిమెంట్స్‌ కూడా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. రాహుల్‌ రెడ్డి, లోక్కు సాయి వరుణ్‌ మరియు శ్రీరాములు రెడ్డి నిర్మించిన ‘టుక్‌ టుక్‌’ క్రియేటివ్‌ తరహాలో ప్రేక్షకుల మనన్నలు పొందుతుంది. పోస్టర్‌లో హీరోనో, హీరోయిన్‌నో కాకుండా ఈ ఆటో పెట్టడం వెనుక ఉన్న కథాంశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులకు క్యూరియాసిటీని పెంచుతుంది. దీనికి సంతు ఓంకార్‌ సంగీతం అందించారు. హార్థిక్‌ శ్రీకుమార్‌ సినిమాటోగ్రఫీ అందించారు. టుక్‌ టుక్‌ ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్‌ రైడ్‌గా ఎక్స్పీరియన్స్‌ చెయ్యడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నట్టు ఈ పోస్టర్‌ రెస్పాన్స్‌ బట్టి అర్ధమవుతుంది.

Tuk Tuk First Look :

Tuk Tuk First Look Revealed 

Tags:   TUK TUK
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ