అఖిల్ అక్కినేని ప్రేక్షకులకి కనిపించి ఏడాదైపోయింది. గత ఏడాది ఏప్రిల్ లో ఏజెంట్ గా వచ్చి నిరాశ పరిచిన అఖిల్ మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టే విషయంలో ఏడాది పొడవునా ఆలోచిస్తూనే ఉన్నాడు. అఖిల్ అక్కినేని కొత్త సినిమా కబురు కోసం అక్కినేని అభిమానులు చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు.
కానీ అఖిల్ కొత్త సినిమా విషయంలో మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేకపోతుయాడు. ఇలా అయితే కష్టమంటూ అక్కినేని అభిమానులు అఖిల్ కెరీర్ విషయంలో మధనపడుతున్నారు. ఆ కొత్త దర్శకుడు అనిల్ తో అఖిల్ ధీర మూవీ అనౌన్సమెంట్ కోసం వెయిటింగ్ అంటున్నా అఖిల్ మాత్రం చొరవ చూపించడం లేదు.
అసలు అఖిల్ తన నెక్స్ట్ సినిమా చేస్తాడా.. లేదంటే ఏమిటి అనేది అర్ధం కాక అభిమానులే కన్యూజ్ అవుతున్నారు. హీరో కూడా డిజాస్టర్స్ కి భయపడి సైలెంట్ గా మారితే ఎలా.. కెరీర్ లో ముందుకు వెళుతూ ఉంటే సక్సెస్ అదే వస్తుంది. వెంటనే రావాలంటే రాదు కదా.. దానికోసమే మన ప్రయత్నం మనం చెయ్యాలంటూ అభిమానులు అఖిల్ కే సలహాలు ఇస్తున్నారు.