Advertisementt

ఊహించని కాంబోలో మెగాస్టార్

Sun 19th May 2024 03:48 PM
chiranjeevi  ఊహించని కాంబోలో మెగాస్టార్
Chiranjeevi in an unexpected combo ఊహించని కాంబోలో మెగాస్టార్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వసిష్ఠ దర్శత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఫుల్ సస్వింగ్ లో నడుస్తుండగా.. చిరు డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ లో కనిపిస్తూ అభిమానులని ఛాలెంజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక చిరు తదుపరి మూవీపై చాలా ఆసక్తి నడుస్తుంది.

ప్రముఖ రైటర్ మచ్చ రవి రెడీ చేసిన కథ ఇప్పటికే ఫైనల్ అయ్యింది. ఆ కథకి తగ్గ దర్శకుడు దొరికితే చిరు తన తదుపరి మూవీని కుమార్తె సుస్మిత నిర్మాతగా అనౌన్స్ చేస్తారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ ఊహించని కాంబోలో మూవీని ప్రకటించేందుకు తన బర్త్ డే ని ఎంచుకున్నారనే వార్త వైరల్ గా మారింది.

అది యానిమల్ చిత్రంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చెయ్యాల్సిన స్పిరిట్ గనక ఆలస్యమైతే మెగాస్టార్ చిరు తో మూవీని అనౌన్స్ చేసే అవకాసం ఉంది. అది కూడా చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22 నే చిరు-సందీప్ వంగ కాంబో మూవీపై అధికారిక ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు.

మరి సందీప్ వంగ దర్శకత్వం అంటే చిరు కేరెక్టర్ పై అంచనాలు ఎలా ఉంటాయో ఊహకి కూడా అందవు. ఈ కాంబో నిజంగా ఫిక్స్ అయితే మెగా ఫాన్స్ కి పూనకాలే.

Chiranjeevi in an unexpected combo:

Chiranjeevi To Star Under Sandeep Vanga Direction

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ