Advertisementt

విజయ్ దేవరకొండ ప్లానింగ్ ఏమిటో?

Sun 19th May 2024 02:36 PM
vijay  విజయ్ దేవరకొండ ప్లానింగ్ ఏమిటో?
What is Vijay Devarakonda planning? విజయ్ దేవరకొండ ప్లానింగ్ ఏమిటో?
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ ప్రస్తుతం విశాఖలో VD 12 షూటింగ్ లో చాలా బిజీగా వున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నా ఈ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరిగిపోతుంది. ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ ని విజయ్ పట్టించుకోకుండా పనిలో పడిపోయాడు. ఇక మే 9 బర్త్ డే రోజు విజయ్ దేవరకొండ టప టపా రెండు సినిమాలను అనౌన్స్ చేసాడు.

ఆ రెండు సినిమాలు పాన్ ఇండియా చిత్రాలే. మరి విజయ్ దేవరకొండ రాహుల్ సంకీర్తన్ తో ఒక చిత్రం, మరొకటి దిల్ రాజు బ్యానర్ లో రవికిరణ్ కోలా తో మరొక చిత్రం మొదలు పెట్టాడు. అయితే రెండు సినిమాలనిఒకేసారి అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ ముందుగా అంటే VD 12 తర్వాత ఏ దర్శకుడితో సినిమా మొదలు పెడతాడనే విషయంలో రౌడీ ఫాన్స్ కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

రాహుల్ సంకీర్తన్ తో మైత్రి మూవీస్ చిత్రం ముందుగా మొదలు పెడతాడా.. లేదంటే రవికిరణ్ కోలా తో దిల్ రాజు బ్యానర్ చిత్రాన్ని ముందు పట్టాలెక్కిస్తాడా.. అసలు విజయ్ దేవరకొండ ప్లానింగ్ ఏమిటో అని ఆయన అభిమానులు చాలా సస్పెన్స్ తో ఎదురు చూస్తున్నారు. 

What is Vijay Devarakonda planning?:

With which director will Vijay Deverakonda start a film after VD 12?

Tags:   VIJAY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ