Advertisementt

పుష్ప-2 నుంచి రేపే పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్‌

Tue 30th Apr 2024 06:03 PM
pushpa 2  పుష్ప-2 నుంచి రేపే పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్‌
Pushpa Pushpa Pushpa Raj to Set Hearts Ablaze! పుష్ప-2 నుంచి రేపే పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్‌
Advertisement
Ads by CJ

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా స‌న్పేష‌న్‌. తాజాగా చిత్ర యూనిట్ ఇచ్చిన అప్‌డేట్‌తో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబ‌రాల్లో వున్నారు. 

పుష్ప-2 దిరూల్‌ నుంచి రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు  తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ  భాషల్లో

పుష్ప..... పుష్ప... పుష్ప... పుష్పరాజ్‌ అనే తొలి లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్‌. ఈ అప్‌డేట్‌తో ఐకాన్‌స్టార్‌ అభిమానులు సంబరాల్లో వున్నారు. ఇందుక సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఐకాన్‌స్టార్‌  పూర్తి మాస్‌గెటప్‌లో నడుస్తూ కనిపిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 

2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2  ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి.

Pushpa Pushpa Pushpa Raj to Set Hearts Ablaze!:

Unveiling the Full Song: Pushpa Pushpa Pushpa Raj to Set Hearts Ablaze!

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ